విద్యుత్ రంగంలో ఏపీఈపీడీసీఎల్ అగ్రగామి
తాటిచెట్లపాలెం: ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ, పంపిణీ నష్టాలను 5.88 శాతానికి తగ్గించి దేశంలోనే మేటి సంస్థగా నిలిచామన్నారు. ‘పీఎం సూర్యఘర్’ పథకం కింద 43,340 మందికి రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు అమర్చి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. వినియోగదారుల సేవల కోసం విశాఖలో ‘సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 80 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సంస్థ చీఫ్ విజిలెన్స్ అఫీసర్ కేవీ రామకృష్ణప్రసాద్, సీజీఎంలు సుమన్ కళ్యాణి, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, ఎల్.మహేంద్రనాధ్, ఎల్. దైవప్రసాద్, ఎస్ విజయప్రతాప్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
సీఎండీ పృథ్వీతేజ్


