కలెక్టర్ బంగ్లాలో హై–టీ వేడుకలు
మహారాణిపేట: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం ‘హై–టీ’ వేడుకను నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, స్థానిక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పి. విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కోస్ట్ గార్డ్ డీఐజీ రమేష్ మిట్టల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోషిణి అపరంజి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, లతా మాధురి, నేవీ అధికారులు పాల్గొన్నారు. వివిధ నృత్య అకాడమీలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా అలరించాయి. అనంతరం ఈ వేడుకల విజయవంతానికి సహకరించిన అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ, కళాకారులను జ్ఞాపికలతో సత్కరించారు.


