
కేజీహెచ్‌కు 5 బ్యాటరీ వాహనాలు
మహారాణిపేట: రోగుల రవాణా కోసం 24/7 పనిచేసే ఐదు బ్యాటరీ కార్లను కేజీహెచ్‌కు విశాఖ స్టీల్‌ప్లాంట్ అందజేసింది. కేజీహెచ్ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున, స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్(ప్రాజెక్ట్) ఎ.కె.బాగ్చి వీటిని ప్రారంభించారు. సీఈఆర్(కార్పొరేట్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా స్టీల్‌ప్లాంట్ రూ.40 లక్షలు వెచ్చించి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను కొనుగోలు చేసి కేజీహెచ్‌కు అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగుల రవాణాకు ఉపయోగపడేలా బ్యాటరీ వాహనాలు అందించిన స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ డైరెక్టర్ బాగ్చి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని, రోగుల కోసం ఈ వాహనాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్‌కుమార్ ఉక్కు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ డైరెక్టర్‌కు జ్ఞాపిక అందజేశారు. అనంతరం కలెక్టర్, స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ బ్యాటరీ కార్లను నడిపారు. స్టీల్‌ప్లాంట్ సీజీఎం(సర్వీసెస్) ప్రవీణ్ కుమార్, ఏఎంసీ ప్రిన్సిపాల్ జి.బుచ్చిరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఉక్కు కర్మాగారం ఫారెస్ట్ అండ్ కై ్లమేట్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఈవీఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
రూ.40లక్షలతో కొనుగోలు చేసిన స్టీల్‌ప్లాంట్

కేజీహెచ్‌కు 5 బ్యాటరీ వాహనాలు