క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలి

Nov 28 2026 10:35 AM | Updated on Nov 28 2026 10:35 AM

క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలి 108 అంబులెన్స్‌ పరిశీలన కేశంపేట: మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను శుక్రవారం ప్రోగ్రాం మేనేజర్‌ జాన్‌ షాహిద్‌, జిల్లా మేనేజర్‌ రాజబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, అత్యవసర మందులతో పాటు ఇతర సౌకర్యాలు పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. అవసరమైన పరికరాలతో పాటు మందులను ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంబులెన్స్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంబులెన్స్‌ సిబ్బంది ఈఎంటి రామచంద్రయ్య, పైలట్‌ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు. మీర్‌ఖాన్‌పేట ఠాణాను సందర్శించిన సీపీ

హుడాకాంప్లెక్స్‌: క్రీడలపై యువతలో ఆసక్తి పెంపొందించి, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. రాష్ట్రంలో నిర్వహించనున్న 8వ ఎడిషన్‌ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026 ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌, ప్రచార పోస్టర్లను శుక్రవారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.స్వర్ణలత, గేమ్స్‌ నోడల్‌ అధికారి, డిప్యూటీ కలెక్టర్‌ కె.అనుషతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రచార కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. గేమ్స్‌ విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు.

యాచారం: ఫ్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి శుక్రవారం మీర్‌ఖాన్‌పేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. భద్రతా వ్యవహారాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదని సిబ్బందికి సూచించారు. పటిష్ట నిఘా ఉండాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విషయంలో, కేసులు నమోదు చేసే విధానంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కేసుల నమోదు, ఫిర్యాదుల స్వీకరణ రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement