ఎన్నికల హామీలు అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలు అమలు చేయండి

Nov 28 2026 10:35 AM | Updated on Nov 28 2026 10:35 AM

యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు శుక్రవారం నగరంలోని ప్రజాభవన్‌కు తరలివెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాభవన్‌ ఇన్‌చార్జి గద్వాల విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన 2,200 ఎకరాల పట్టా భూమిని తిరిగి రైతుల పేర్లపై మార్చాలని, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 900 మందికి పైగా రైతులకు చెందిన 2,200 ఎకరాల పట్టా భూమిని తీసుకోకుండా ఉండాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు కమిషన్‌ చైర్మన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు ఫార్మాసిటీ భూ బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేయడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలతో పాటు నాలుగు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఫార్మాసిటీ భూ బాధితుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement