రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Nov 28 2026 10:35 AM | Updated on Nov 28 2026 10:35 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

అనంతగిరి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం రాత్రి వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధి బుగ్గ – కెరెళ్లి రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ధారూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన జోగు రాజు, బైండ్ల భానుచందర్‌ వికారాబాద్‌లో పనులు ముగించుకుని స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. బుగ్గ దాటాక కల్వర్టు వద్ద బైక్‌ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ అదుపుతప్పి కింద పడ్డారా లేక ఏదైన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా అనే విషయం తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను 108లో వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement