ఎల్‌నినోను ఎదుర్కొనే శక్తినివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొనే శక్తినివ్వాలి

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

పోచమ్మ తల్లిని వేడుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

అనంతగిరి: ఎల్‌నినోను ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. శుక్రవారం వికారాబాద్‌ మండలం సిద్దులూరు గ్రామంలో పోచమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సర్పంచ్‌ శ్రీనివాస్‌, గ్రామస్తులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. కరువు నుంచి గట్టెక్కించి రైతులు, ప్రజలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు.

సీఎం పర్యటనను

అడ్డుకుంటాం

ఏబీవీపీ నగర కార్యదర్శి మారుతీ రాజ్‌

తాండూరు టౌన్‌: విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఏబీవీపీ నగర కార్యదర్శి మారుతీ రాజ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించకుండా, అణగారిని వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేవలం అభివృద్ధి అంతా కొడంగల్‌ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైందని, జిల్లాలోని మిగిలిన మూడు నియోజకవర్గాలను విస్మరించడం అన్యాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

బస్సును పునరుద్ధ్ధరించండి

పరిగి: మండలంలోని రుసుంపల్లి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప కోరారు. శుక్రవారం పరిగి డీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రామం మీదుగా వెళ్లే బస్సును రద్దుచేయడంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలి పారు. విద్యార్థులు పాఠశాలలకు వెల్లడం కష్టంగా మారిందన్నారు. బస్సును పునరుద్ధరించా లని కోరారు. కార్యక్రమంలో నాయకులు గండీడు మాజీ ఎంపీపీ కొమిరి లక్ష్మయ్య, టెలికాం బోర్డు సభ్యుడుపెంటయ్య గుప్తా, బీజేపీ మహ్మదబాద్‌ మండల అధ్యక్షుడు మూస నర్సింలు, బీజేవైఎం మండల అధ్యక్షుడు యాదగిరి, నాయకులు శ్రీనివాస్‌, విజయకుమార్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టుల

అర్హతలో గందరగోళం

తాండూరు టౌన్‌: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల అర్హతలో పట్టణంలోని పలు వార్డుల స్థానికతపై గందరగోళం నెలకొంది. ఓ వార్డులో నివాసం ఉన్నవారు మరో వార్డులో అర్హత పొందడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టణంలోని మాణిక్‌నగర్‌ పేరుతో నోటిఫికేషన్‌ వేసి, స్వీపర్‌ కాలనీ, పోలీస్‌ క్వార్టర్స్‌, పోచమ్మ గుడి వార్డు నెంబర్‌ 17 కలాల్‌ గల్లీ, వార్డు నంబర్‌ 15 లేదా 16లోని స్థానికులను అర్హులను ఎలా చేస్తారని పలువురు సంశయం వ్యకం చేస్తున్నారు. మాణిక్‌ నగర్‌ 14వ వార్డులో ఉన్న స్థానికులను, 13వ వార్డు గెజిట్‌లో స్థానికులుగా ఎలా చూపిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నడుమ పట్టణంలోని మాణిక్‌ నగర్‌ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకి ఏకంగా 64 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో అయోమయం నెలకొంది. దీంతో ఓ వార్డులో ఉన్న వారు, మరోవార్డులో ఉన్న పోస్టుకు దర ఖాస్తు చేసుకోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. వెంటనే మున్సిపల్‌ అధికారులు స్పందించి వార్డు స్థానికతకుసంబంధించిన స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement