దోమ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని డీఈఈ ముక్రమ్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి, ఏఈ నవీన్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు.. ఎన్ని నిర్మాణాలు ప్రారంభించారు అనే విషయాలు తెలుసుకున్నారు. ప్రారంభించని వారిని గుర్తించి, పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ ఇళ్లను పరిశీలించారు. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఈ ముక్రమ్


