పగలు ఎండ.. రాత్రి చలి చలికాలంలో ఎండ తీవ్రత తగ్గడం లేదు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతున్నాయి. | - | Sakshi
Sakshi News home page

పగలు ఎండ.. రాత్రి చలి చలికాలంలో ఎండ తీవ్రత తగ్గడం లేదు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతున్నాయి.

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

పగలు ఎండ.. రాత్రి చలి చలికాలంలో ఎండ తీవ్రత తగ్గడం లేదు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతున్నాయి. 11లోu

తాండూరు: ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో సేవ్‌ వాటర్‌ పేరిట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న జలవనరులను పొదుపుగా వినియోగించుకువాలని సూచిస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజాబాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. 31వ వార్డులో కౌన్సిలర్‌ యోగానంద్‌ నీటి వృథాను అరికట్టేందుకు కుళాయిలకు బిరడాలు బిగించారు. మున్సిపల్‌ పరిధిలో లక్షకు పైగా జనాభా ఉంది. 36 వార్డులు.. ఆరు వేల కుళాయిలు ఉన్నాయి. రోజుకు 6.50 ఎంఎల్‌డీల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే చాలా చోట్ల బిరడాలు లేక నీరు వృథాగా పోతోంది. దీన్ని అరికట్టేందుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పైపులు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. పట్టణంలో తొమ్మిది ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. మరో 325 విద్యుత్‌ పవర్‌ బోర్లు, 122 చేతిపంపులు ఉన్నాయి. కాగ్నా నది వద్ద రెండు పంప్‌హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. 9 మంది రెగ్యులర్‌, 18 మంది కాంట్రాక్టు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు కుళాయిల వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ లీకేజీలను అరికడుతున్నారు.

ముందస్తు ప్రణాళిక

ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో ఏర్పడిన మార్పులు, వర్షపాతం అనిశ్చితి, భూగర్భజల మట్టాలు తగ్గడం వంటి పరిణామాలు భవిష్యత్తులో తాగునీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పట్టణ జనభా పెరుగుతున్న కొద్దీ నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నీటి వనరుల అభివృద్ధి తోపాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకు 6.50 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ వినియోగంలో నిర్లక్ష్యం కారణంగా వృథా అయితే భవిష్యత్‌లో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందులో భాగంగానే ముందస్తు చర్యలకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తోంది.

కుళాయిలకు ట్యాపులు

నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. 31వ వార్డులోని మార్వాడి బజార్‌లో తాగునీటి పైపులకు ట్యాప్‌లు బిగించాం. నీటిని పొదుపుగా వాడుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

– యోగానంద్‌, 31వ వార్డు కౌన్సిలర్‌, తాండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement