మంచాల: ముదిరాజ్లు మరింత బలపడాలని శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అస్మత్పూర్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి, గంగాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహా సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.యాదయ్యముదిరాజ్, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు దూస వెంకటేశ్ ముదిరాజ్, సంఘం నాయకులు బోళ్ల జగన్, ఎడ్ల గణేశ్, ధర్మంవీర్, సత్యం ముదిరాజ్, గంట భిక్షపతి, జిల్లామోని సత్తయ్య,కావలి నర్సింహ, బీఆర్ఎస్ నేతలు, పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.


