పత్తికి వర్షం దెబ్బ | - | Sakshi
Sakshi News home page

పత్తికి వర్షం దెబ్బ

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

మోమిన్‌పేట: పత్తి రైతుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాలు పడటంతో పంట వేశారు. జూలై మాసంలో వానలు కురవడంతో మేలు జరిగింది. ఆ తర్వాత ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు మూడు నెలలు ముఖం చాటేశాడు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో వర్షాలు లేక పంటలు ఎదగలేదు. చెట్టుకు పదికి మించి కాయలు రాలేదు. ఎండల తీవ్రత కారణంగా గూడు, పిందె రాలిపోయింది. 15 రోజలు క్రితం పత్తి కాయ విప్పుకుంది. తీసేందుకు రైతులు సమాయత్తం అవుతుండగా వర్షాలు పడి తీవ్ర నష్టం వాటిల్లిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు కూడా దొరకడం లేదని తెలిపారు. కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కూలీలకు వాహన చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని తెలిపారు. మార్కెట్‌లో ధర బాగానే ఉన్నా దిగుబడి లేక నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement