ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రవీందర్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆదిభట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధి కొంగరకలాన్ డివిజన్లో పార్టీ శ్రేణులతో కలిసి పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి.. ఓటరు నమోదు ఫారాలు అందజేశారు. ఆన్లైన్లో నమోదు చేయించారు. అర్హులందరూ హక్కు వినియోగించుకోవాలని సూచించారు. నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ అవలంభిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పారు. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


