కరువు వేళ.. కడుపు నిండేలా | - | Sakshi
Sakshi News home page

కరువు వేళ.. కడుపు నిండేలా

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

శిఖంలో సాగు వివరాలు ఇలా..

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

బషీరాబాద్‌: జిల్లాలో నెలకొన్న కరువు నేపథ్యంలో పశు సంపదకు మేత కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెరువుల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయా లని నిర్ణయించారు. జిల్లాలోని 216 చెరువుల పరిధి లో ఉన్న 1,596 ఎకరాల భూములు ఇందుకు అనువైనవిగా గుర్తించి, కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఒక్కరికి పది గుంటలు

జిల్లాలో మొత్తం 12,309.21 ఎకరాల చెరువు భూములుండగా.. వీటిలో సాగుకు అనుకూలమైన స్థలాలను అధికారులు గుర్తించారు. తాండూరు నియోజకవర్గంలోని 76 చెరువుల పరిధిలో 717 ఎకరాలు, వికారాబాద్‌లోని 73 చెరువుల పరిధిలో 608 ఎకరాలు, పరిగి 40 చెరువుల పరిధిలోని 176 ఎకరాలు, కొడంగల్‌ 27 చెరువుల పరిధిలోని 95 ఎకరాలను గడ్డి పెంపకం కోసం ఎంపిక చేశారు. ఈ శిఖం భూముల్లో ఒక్కో పాడి రైతుకు పది గుంటల విస్తీర్ణంలో పచ్చిమేత సాగు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఆవులు 1.33 లక్షలు.. గేదెలు 66,700

జిల్లాలో 1,33,000 ఆవులు, 66,700 గేదెలు కలిపి మొత్తం 1,99,700 పశువులున్నాయి. వీటితోపాటు 2,05,000 గొర్రెలు, 2,55,000 మేకలు ఉన్నాయి. మొత్తంగా 4,60,000 గొర్రెలు, మేకల పోషణకు అవసరమైన మేత అందుబాటులో ఉంచడం అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుతం ఉన్న మేత నిల్వలు ఫిబ్రవరి నెలాఖరు వరకు మాత్రమే సరిపోతాయని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. బీవీజీరాంజీ పథకం కింద పది గుంటల విస్తీర్ణంలో పచ్చిమేత సాగు చేపట్టే రైతుకు రూ.18 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌జీ 848 రకం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. సొంత పొలాల్లోనూ వరికి బదులుగా పచ్చిమేత సాగు చేస్తే రూ.18 వేల వరకు ఆర్థిక సాయంతోపాటు ఉచితంగా గడ్డి విత్తనాలు అందజేయనున్నారు.

మూగజీవాల దాహార్తి తీరేలా..

జిల్లాలోని 580 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటికే 1,000 నీటి తొట్లు ఉండగా.. వీటిలో 600 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మరో 400 తొట్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా మరో 1,000 నీటి తొట్లను వీబీజీరాంజీ నిధులతో ఒక్కోదానికి రూ.35 వేల చొప్పున నిర్మించేందుకు నివేదికలు సిద్ధం చేశారు. పశువులకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జీపీలు ప్రతిరోజూ తొట్లను నీటితో నింపి ఉంచాలని సూచిస్తున్నారు.

పశుసంపద పరిరక్షణపై సర్కార్‌ నజర్‌

శిఖం భూముల్లో గడ్డిసాగుకు నిర్ణయం

జిల్లాలో 216 చెరువుల పరిధిలో 1,596 ఎకరాల గుర్తింపు

వీబీజీరాంజీ కింద రైతుకు రూ.18 వేల ప్రోత్సాహకం

సొంత భూముల్లో పచ్చి మేత సాగు చేసినా వర్తింపు

తాండూరు 76 717

వికారాబాద్‌ 73 608

పరిగి 40 176

కొడంగల్‌ 27 95

పశుసంపదను కాపాడుకోవడానికి ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకం ఇస్తోంది. జాబ్‌ కార్డులేకున్నా బీవీజీరాంజీ పథకం కింద పాడి రైతులకు శిఖం భూముల్లో పచ్చిమేత సాగు కోసం రూ.18 వేలతో పాటు ఫ్రీగా గడ్డి విత్తనాలు అందజేస్తుంది. ఎంపీడీఓ దగ్గర దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– సదానందం, జిల్లా పశువైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement