ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగిస్తాం

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

వికారాబాద్‌ పౌరసరఫరాల

సంస్థ స్పష్టీకరణ

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిల అంశంపై ‘సాక్షి’లో వసూళ్లు ‘కస్టమ్‌’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి వికారాబాద్‌ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ ఎస్‌.నరసింహ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 50 మిల్లర్ల నుంచి రూ.102 కోట్ల బకా యిలు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. మరో రూ.77 కోట్లు వసూలు కావాల్సి ఉందని పేర్కొ న్నారు. బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన తుది గడువు సెప్టెంబర్‌ 31తో ముగిసిన నేపథ్యంలో ఆయా మిల్లర్లపై ఆర్‌ఆర్‌యాక్ట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. రికవరీ యాక్ట్‌కు కూడా స్పందించని మిల్లర్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement