దోమ: భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర దాడుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన అన్వర్‌కు గ్రామంలో మూడెకరాల 25 గుంటల భూమి ఉంది. అందులో ఒక ఎకరం 35 గుంటలు ఎండోమెంట్ పరిధిలోకి వెళ్లగా, మిగతా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన నరేశ్ ఇంటి ముందు ఉన్న ఖాలీ స్థలాన్ని గతంలో అన్వర్ కుటుంబం కేటాయించింది. అదనంగా కావాలంటూ ఆక్రమించుకోవడంతో కొంత కాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. కర్రలతో దాడి చేసుకున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు, కేసు నమోదు


