పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి బైక్‌ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం ప్రతి ఇంటికీఇంకుడు గుంత ఉండాలి

దోమ: పాడి పశువుల ఆరోగ్యంంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల పశువైద్యాధికారి చందన, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఆనంద్‌ తెలిపారు. శుక్రవారం మండలంని మైలారం గ్రామంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పాడి పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశువులకు వచ్చే రోగాలపై నిర్లక్ష్యం చూపరాదన్నారు. వెంటనే వైద్యం చేయించాలని సూచించారు. పాడి పరిశ్రమ ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శివాని నాయక్‌, ఉపసర్పంచ్‌ సాలే ప్రభావతి, గోపాలమిత్ర సూపర్‌వైజర్లు సారంగి, కేశశులు, రాజు, సైదులు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

దోమ: బైక్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన దోమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వసంత్‌ జాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోత్కూర్‌ గ్రామానికి చెందిన రాకొండ వెంకటయ్య(42) ఉదయం ఇంటి నుంచి పని నిమిత్తం పరిగి పట్టణానికి వెళ్లాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో తిమ్మాయపల్లి సమీపంలో బెక్‌ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌

కుల్కచర్ల: గ్రామానికి ఒక ఊట కుంట.. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చని కాంగ్రెస్‌ పార్టీ చౌడాపూర్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం మెట్టుతండాలో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మ, ఉప సర్పంచ్‌ గోపాల్‌ నాయక్‌, పంచాయతీ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

సంఘటితంగా పోరాడుదాం

చేవెళ్ల: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్‌తో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బేగరి మహేశ్‌ అన్నారు. చేవెళ్లలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో ఇటీవల విడుదలైన ప్రభుత్వ నోటఫికేషన్‌లలో మాలలకు ఒక్క ఉద్యోగం రావటం లేదన్నారు. ఇప్పటికై నా ఉద్యమించకపోతే అస్తిత్వాన్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ రంగంలో తీవ్రంగా నష్టపోతున్నందున ఉద్యమం అనివార్యం అని పేర్కొన్నారు. మాలలంతా ఏకమై హక్కులు సాధించేవరకు పోరా డాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆదేశాల మేరకు అన్ని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ కమిటీలు ఈనెల 30 నాటితో రద్దు అవుతున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ఆధారంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఉపాధి పనుల పరిశీలన

మంచాల: మండలంలోని రంగాపూర్‌లో కొనసాగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను డీఆర్‌డీఓ పీడీ శ్రీలత శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న ఫారంపాండ్‌ పనులను పరిశీలించి కొలతల ప్రకారం చేపట్టాలని సూచించారు. అనంతరం జలాల్‌మియా గ్రామంలో మనిత అనే మహిళా రైతుకు ప్రభుత్వం అందించిన గడ్డి కుట్టు మిషన్‌, నాటు కోళ్ల షెడ్‌ను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement