అనుమతి లేకుండా మద్యం పార్టీ | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా మద్యం పార్టీ

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

చేవెళ్ల: అనుమతులు లేకుండా ఓ ఫామ్‌ హౌస్‌లో కళాశాల విద్యార్థులు మద్యం పార్టీ నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మెట గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో శుక్రవారం పెద్ద ఎత్తున మద్యం పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మన్నన్‌ అనే వ్యక్తి పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ఈనెల 30న పార్టీ నిర్వహిస్తున్నట్లు ఎంట్రీ ఫీజు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన వారికి లొకేషన్‌ పంపించి పార్టీకి రప్పించాడు. ఈ పార్టీలో దాదాపు 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా నిర్వాహకుడు మన్నన్‌తోపాటు మరో ముగ్గురు గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పార్టీలో ఉపయోగించిన మద్యం బాటిళ్లు, 15 గ్రాముల గంజాయి, ఏడు కార్లు, మూడు మోటార్‌సైకిళ్లు, 70 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌ను యజమాని నుంచి వేరే వ్యక్తులు లీజుకు తీసుకొని పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. లీజుకు తీసుకున్న వ్యక్తులను సైతం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఫామ్‌ హౌస్‌పై ఎస్‌ఓటీ, పోలీసుల దాడి

డ్రగ్స్‌ పరీక్షలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ

కేసు నమోదు చేసి దర్యాప్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement