శంకర్‌పల్లి: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్ గౌడ్ అన్నారు. మండలంలోని ప్రొద్దటూరు వద్ద శుక్రవారం పార్టీ మండల అధ్యక్షురాలు లీలావతి అధ్యక్షతన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తోందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రాములు, బండమీది వెంకటయ్య, నర్సింహ, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


