కుల్కచర్ల: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కుల్కచర్ల జెడ్పీ బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక, టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గాన్ని క్రీడారంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జైపాల్ రెడ్డి, పీడీ ఖాజా, ప్రవీణ్, పీఈటీ కేశవులు, సర్పంచ్ అంజిలయ్య, ఇన్చార్జ్ హెచ్ఎం అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి


