కరువు సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని, ప్రభుత్వం ముందస్తు కరువు నివారణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తాగు, సాగు నీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే చేసి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, రేషన్‌ షాపుల్లో 14 రకాల నిత్యావసర సరకులు అందించాలని కోరారు. పేదల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కామ్రేడ్స్‌ పాష, నరహరి జ్ఞాపకార్థం 50 అడుగుల స్మారక స్థూపాన్ని జాపాల గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామని.. ఈ స్థూపాన్ని ప్రారంభించేందుకు పార్టీ జాతీయ కార్యదర్శి ఎంఎ బేబి త్వరలో రానున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీశ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.సామేల్‌, నాయకులు కె.భాస్కర్‌, ఎం. చంద్రమోహన్‌, డి.జగదీశ్‌, జి.కవిత, ఇ.నర్సింహ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement