ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● మండల ఉత్తమ టీచర్లకు సన్మానం

పరిగి: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో మండల ఉత్తమ టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల కృషి ఎంతో ఉంటుందన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంబిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. అనంతరం పరిగి పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీటు సాధించడంతో వారి చదువుల కోసం ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, పీఏసీఎస్‌ చైర్మర్‌ పార్థసారథి పంతులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement