మందు లేక వికారాబాద్‌కు తరలింపు
బొంరాస్‌పేట: పాముకాటుకు గురైన వ్యక్తిని కుటుంబ సభ్యులు కొడంగల్ ఆస్పత్రికి తీసుకరాగా మందు లేకపోవడంతో వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బొంరాస్‌పేట మండలం నాందార్పూర్కు చెందిన చోటేమియా పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే కొడంగల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మందు లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యుడు శేఖర్ ఆస్పత్రికి వెళ్లి చోటేమియాను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిల్లా వైద్యాధికారులు స్పందించి కొడంగల్ ఆస్పత్రిలో పాముకాటు మందును అందుబాటులో ఉంచాలని సూచించారు.
చనిపోయిన పాము
చోటేమియానుపరామర్శిస్తున్న లక్ష్మి


