ఓటు నమోదు చేయించుకోండి | - | Sakshi
Sakshi News home page

ఓటు నమోదు చేయించుకోండి

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

కందుకూరు: పట్టభద్రులు అందరూ ఓటరుగా పేర్లు నమోదు చేయించుకోవాలని ఏఈఆర్‌ఓ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి కోరారు. గురువారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు, నామినేషన్లు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఓటర్ల నమోదుతో పాటు ఇతర అంశాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాభై వేల మంది వరకు పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకున్నారన్నా రు. ఈ దఫా ఇప్పటి వరకు కేవలం 29 వేల మంది వరకు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. నవంబర్‌ 6వరకు మాత్రమే ఓటరుగా నమోదుకు అవకాశం ఉందన్నారు. గతంలో ఓటు వేసిన వారు సైతం కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement