తాండూరు టౌన్: చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి ప్రణయ
పరిగి: సమావేశంలో మట్లాడుతున్న జడ్జి నాగుల శిల్ప
తాండూరు టౌన్/అనంతగిరి/పరిగి: బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని తాండూరు కోర్టు అడిషనల్ సివిల్ జడ్జి ప్రణయ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నంబర్ 2 పాఠశాలలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్, న్యాయవాదులు దేవరాజ్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత అన్నారు. గురువారం వికారాబాద్‌లోని ఏపీఆర్ భ్రూంగి జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది శ్రీనివాస్, కళాశాల డైరెక్టర్లు శివప్రసాద్, కుమారస్వామి, ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
లైంగిక వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగులశిల్ప హెచ్చరించారు. గురువారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులను ప్రతి విద్యార్థీ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు విజయ్‌కుమార్, లీగల్ ఏడ్ కౌన్సిల్ గౌస్‌పాష, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు కోర్టు అడిషనల్ సివిల్ జడ్జి ప్రణయ


