యాలాల: మూర్ఛ వ్యాధితో కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ శివారులో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన రాముగౌడ్(47)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. దీనికితోడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈనెల 26న తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా, ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య జ్యోతి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. బుధవారం ఉదయం దౌలాపూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తు పట్టారు. మృతుడికి మూర్ఛ వ్యాధి ఉండటంతో కిందపడి చనిపోయి ఉంటాడని జ్యోతి యాలాల పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
యాలాల: బైక్‌ను సిమెంటు ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ సమీపంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పగిడియాల గ్రామానికి చెందిన సతీష్(23) పని నిమిత్తం కొడంగల్‌కు వెళ్లి మధ్యాహ్నం బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా.. అజాగ్రత్తగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో సతీష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కడ్తాల్: యంగ్ ఎర్త్ లీడర్ 2025–26 వార్షిక పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఈ నెల 31న (శనివారం) అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్, సెబీ, ఎన్‌ఎస్‌ఈ–ఎస్‌ఎస్‌సీ సంస్థల ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు, పర్యావరణవేత్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ వైఈఎల్పీ పాఠశాలలు, ఉత్తమ మెంటర్స్ టీచర్స్, పర్యావరణ ఉపాధ్యాయులు, ఉత్తమ యంగ్ ఎర్త్ లీడర్స్ విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశాంసపత్రాలు అందించి సత్కరించనున్నట్లు చెప్పారు.
ఇబ్రహీంపట్నం: టీఎన్‌జీఓ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్, ఉపాధ్యక్షుడు రంగయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ మాధవ్‌గౌడ్, ట్రైజరర్ ఆనంద్‌సింగ్, జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్, ట్రెజరర్ గోపాల్, షాద్‌నగర్, రాజేంద్రనగర్ ఆమనగల్లు యూనిట్ నేతలు శ్రీనివాస శ్రీహరి, శ్రీలత, దార రాములు, అన్నపూర్ణ, శేఖర్, నగేష్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి స్వయంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం అవుతుందన్నారు. మానవత్వంతో, సామాజిక సేవ కర్తవ్యంగా భావించి పలువురు విద్యార్థులు రక్తదా నం చేయడం అభినందనీయమన్నారు. పోలీ సు అధికారులతోపాటు సుమారు 350 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ జితేందర్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


