పరిగి: బాలల హక్కులను ప్రతి విద్యార్థీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. బుధవారం పట్ట ణంలోని నంబర్ –2 ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని చిన్ననాటి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యల నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని తెలిపారు. పిల్లలకు రక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వారి హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోక్సో చట్టాన్ని బాలలపై జరుగుతున్న లైంగిక దాడులను నిర్మూలించేందుకు తీసుకువచ్చిన చట్టమే అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌నాయక్, బార్ అసోసియోషన్ అధ్యక్షుడు భక్తకుమార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గౌస్ పాష, న్యాయవాదులు శ్రీనివాస్, కృష్ణయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


