వీబీజీరామ్‌జీ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వీబీజీరామ్‌జీ పనులు వేగవంతం చేయాలి

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: గ్రామీణ కూలీలు, రైతులకు వీబీజీరామ్‌జీ కింద పనులు కల్పించాలని, పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి బుధవారం జిల్లా అధికారులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుక అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫర్స్‌కు హాజరయ్యారు. జిల్లాలో చేపట్టిన అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలను నిర్ణిత కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. వీబీజీరామ్‌జీ పనులను విస్తతంగా కల్పించేందుకు నలభై మంది కూలీలకు ఒక మేట్‌ను నియమిస్తున్నామని మంత్రికి వివరించారు. పశుగ్రాసం పెంచే విధంగా, నీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, మిషన్‌ భగీరథ ఏస్‌ఈ రాజేశ్వర్‌రావు, డీపీఓ సురేష్‌ మోహన్‌, వ్యవసాయ శాఖ అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ కిరణ్మయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement