తాండూరు టౌన్: పట్టణ పరిధిలో కుక్కల జనన నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ తెలిపారు. బుధవారం బ్లూక్రాస్ సొసైటీ సౌజన్యంతో, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సాయిపూర్, మాణిక్‌నగర్, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో సిబ్బంది పలు కుక్కలను పట్టుకున్నారు. కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించుటలో భాగంగా వాటి జనన నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
వివాహిత ఆత్మహత్య
బంట్వారం: వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మండలంలోని సల్బత్తాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బీ నందిని(20)కి ఇదే ఊరికి చెందిన ఏ బసప్పతో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. సాయంత్రం బాత్‌రూంకు వెళ్లిన నందిని చాలా సేపటి వరకు బయటికి రాలేదు. కుటుంబీకులు పైకప్పు తొలగించి చూడగా విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి సోదరుడు శివకుమార్ పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ రఘురాములు తెలిపారు.
పర్వేద నీటి పొదుపు చర్యలు భేష్
మంత్రి సీతక్క కితాబు
రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి
ఆమనగల్లు: ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ధర్నాకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గానికి చెందిన పలువురికి బుధవారం నగరంలోని తన నివాసంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి తరలివెళ్తామని స్పష్టంచేశారు. అనంతరం పలువురు నాయకులతో కలిసివెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడురు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బట్టు కిషన్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


