కొడంగల్: కొడంగల్‌లో డాక్టర్‌గా పనిచేసి ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించిన డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు. డాక్టర్‌గా తన వృత్తి ధర్మంతో పాటు మదర్ థెరిస్సా సేవా సంఘం స్థాపించి పేదలకు సేవలందించారు. బహుజన రాజ్యం కోసం బహుజన లెప్ట్ ఫ్రంట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఎస్పీలో చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీగా పని చేశారు. జీ 6 టీవీ స్థాపించి సమస్యలు వెలుగులోకి తెచ్చారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. బీఆర్ఎస్లో చేరి కొడంగల్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
సెల్ ఫోన్‌కు
ఛార్జింగ్ పెడుతూ..
షాక్‌కు గురై యువకుడి దుర్మరణం
చేవెళ్ల: మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాథునాథ్ తన భార్యాపిల్లలతో పాటు అల్లుడితో కలిసి బతుకు దెరువు కోసం నిమిత్తం ఐదు నెలల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహ్మద్ షఫీ అనే వ్యక్తి వద్ద పనికి కుదిరి, వివిధ ప్రాంతాల్లో ప్రీకాస్ట్ పలకలు వేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాథునాథ్ తన భార్య, ఓ కుమారుడు, కుమార్తెతో కలిసి శంకర్‌పల్లిలో పనులకు వెళ్లారు. మరో కుమారుడు రవినాథ్(18), అల్లుడు రాకేశ్నాథ్ చేవెళ్ల సమీపంలోని దామరగిద్ద సమీపంలోని వ్యవయసాయ పొలంలో ప్రీకాస్ట్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో రవినాథ్ తన మొబైల్ ఫోన్‌కు నేరుగా విద్యుత్ తీగలకు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


