మహోన్నత వ్యక్తి దాస్యనాయక్‌ | - | Sakshi
Sakshi News home page

మహోన్నత వ్యక్తి దాస్యనాయక్‌

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

● బంజారాలు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలి

● పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి

కుల్కచర్ల: బంజార ప్రజలు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దాస్యనాయక్‌ తండాలో బంజారా సేవాదళ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో దాస్యనాయక్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఒక గిరిజన ఆవాసం మొత్తం రాజకీయాలకు అతీతంగా దాస్యనాయక్‌ అనే వ్యక్తి చేతుల్లో ఉంటూ మంచి చెడులు చూసుకునే వారని, వారి ఐక్యతను మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బంజార ప్రజలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌, ఎంఈఓ హరిశ్చందర్‌, హరిలాల్‌, సర్పంచ్‌ కవితరాజు, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఆంజనేయులు, ఘట్యనాయక్‌, పరిగి ఆర్టీసీ డిపో కార్మిక సంఘం అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు చంద్రయ్య, విఠల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement