● పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కుల్కచర్ల: విద్యావంతులతోనే వ్యవస్థలో మార్పు వస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకొని ఉత్తమ వ్యక్తికి చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్‌రావు, జిల్లా అధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షుడు వెంకటయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు శరత్‌కుమార్ రెడ్డి, ఘనపురం వెంకటయ్య గౌడ్, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల సౌమ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


