అలయ్‌ బలయ్‌ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

అలయ్‌ బలయ్‌ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద శనివారం అలయ్‌ బలయ్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్‌ బండి మహేశ్‌, కోఆర్డినేటర్‌ ముడుపు వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈనెల 25న నాగోల్‌లోని శుభం ఫంక్షన్‌ హాల్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అందుకు ఐక్యంగా కలిసి ఉద్యమించాలన్నారు. ఉద్యమకారుల ఐక్యతను చాటిచేప్పేందుకు కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సమన్వయకర్తలు వినోద్‌కుమార్‌గుప్తా, తాళ్ల వెంకటేశ్‌గౌడ్‌, అముదాల యాదగిరి, సుధాకర్‌, గోపాల్‌, నూతనగంటి శేఖర్‌, ఎన్‌.యాదయ్య, వెంకటేశ్‌యాదవ్‌, గాజుల గోపాల్‌, భర్తకి రాజు, జహీర్‌బాయ్‌, లక్ష్మీపతి, గణేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement