ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు పెండింగ్‌ పనులు పూర్తి చేయండి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సెంటర్‌ పరిశీలన ఔటర్‌ సమీపంలో కారు దగ్ధం ● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

అనంతగిరి: పూల పండుగ అందరి ఇళ్లల్లో సుఖశాంతులు నింపాలని శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ఆడ బిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు అందించిన ఈ గొప్ప సంస్కృతిని, జీవన విధానాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.

అనంతగిరి: సర్‌ ప్రక్రియ పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్‌ఐఆర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, తదితర అంశాలపై హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పలు శాఖ అధికారులతో కలిసి జిల్లాలో పరిస్థితులను వివరించారు.

అనంతగిరి: వికారాబాద్‌లోని జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్‌డ్డ్‌వ్‌ హెడ్‌ క్వార్టర్‌లోని బెల్‌ ఆఫ్‌ ఆర్‌మ్స్‌ను శనివారం ఎస్పీ స్నేహ మెహ్ర తనిఖీ చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మ్యాగజైన్‌ గది, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆమె ఎంట ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌, ఆర్‌ఎస్‌ఐలు నాగరాజు, శ్రీశైలంగౌడ్‌, అశోక్‌, ఆర్‌ఎస్‌ఐలు రాములు, బాలాజీ నాయక్‌ తదితరులు ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం ఏఎస్పీ రాజేష్‌ మీనా ఆధ్వర్యంలో జిల్లా ప్రాసిక్యూషన్‌ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ నెలలో నమోదైన గ్రేవ్‌ ఆక్సిటల్‌ కేసులపై సమీక్షించారు. ఈ సమావేశంలో లీగల్‌ అడ్వైజర్‌ అనిల్‌కుమార్‌ పీపీ మెహ్రాజ్‌ ఫిర్దోష్‌, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. నాగార్జున సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు శనివారం మధ్యాహ్నం వెళ్తున్న కారు బొంగ్లూర్‌ ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దారిలో వెళ్తున్న ప్రయాణికులు గమనించి కారు అద్దాలను పగలగొట్టి అందులో ఉన్న ఐదుగురు యువకులను బయటకు తీశారు. అదే సమయంలో ట్యాంకర్‌ వెళ్తుండటంతో ఆపి నీరు పోసి మంటలు అదుపు చేశారు. స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నట్టు కారులో ఉన్న యువకులు తెలిపారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

‘పట్నం’లో మోస్తరు వర్షం

ఇబ్రహీంపట్నం: వర్షాభావ పరిస్థితులు, ఉక్కపోతతో సతమతమవుతున్న ఇబ్రహీంపట్నం ప్రజలకు శనివారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షం ఉపశమనం కలిగించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలం కాస్తా ఎండా కాలాన్ని తలపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో ఫ్యాన్లు, కూలర్లు విరామం లేకుండా పనిచేస్తున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గాలులతో కురిసిన తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటికే మంచినీటి సమస్యలు తలెత్తడంతో వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement