పంట కొనుగోళ్లకు సిద్ధమవ్వండి | - | Sakshi
Sakshi News home page

పంట కొనుగోళ్లకు సిద్ధమవ్వండి

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

● సెంటర్ల వద్ద వసతులు కల్పించండి

● జిల్లా వ్యాప్తంగా 140 ధాన్యం సేకరణ కేంద్రాలు

● అదనపు కలెక్టర్‌ వెంకటాచారి

అనంతగిరి: వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో దొడ్డు రకం ధాన్యం సేకరణకు 118, సన్న రకం ధాన్యం సేకరణకు 22, మొత్తం 140 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ సెంటర్‌కు 2 లారీలు 10 మంది హమాలీలను ఏర్పాటు చేస్తామన్నారు. సెంటర్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. డీసీఓ, డీఆర్డీఓ, డీసీఎంఏలు సమన్వయంగా పనిచేయాలన్నారు. టార్పాలిన్లు, తాత్కాలిక షెడ్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఒక్కో సెంటర్‌కు 20 టార్పాలిన్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్న రకాలను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

నవంబర్‌లో పత్తి కొనుగోలు

సీసీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నవంబర్‌ మొదటి వారంలో పత్తి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీఐ ద్వారా అధికారిక ఆదేశాలు అందాయన్నారు. పత్తి క్వింటాలుకు రూ.8,667 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కవిత, శ్రీనివాస్‌, నరసింహ, గణపతి, శ్యాంసుందర్‌, స్వరన్‌సింగ్‌, నాగరాజన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement