యాచారం: మండల పరిధిలోని కుర్మిద్దలో ఎన్ఐయూఎం భవన నిర్మాణ శంకుస్థాపనకు సీఎం రేవంత్రెడ్డి త్వరలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో కార్యక్రమం రద్దయింది. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం పర్యటన ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో శనివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, రెవెన్యూ, మున్సిపల్, టీజీఐఐసీ ఉన్నతాధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. ఎన్ఐయూఎంకు కేటాయించిన స్థలాన్ని అధి కారులు సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, సమావేశపు నిర్మాణం, పార్కింగ్ వంటి విషయాలపై అధికారులు చర్చించారు.


