అనంతగిరి: ప్రకృతిలో దొరికే పూలను పూజించే పండుగే బతుకమ్మ అని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్ర, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ వేడుకల్లో పాల్గొని గౌరీమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ప్రకృతి ఆరాధన, పూల వైవిధ్యానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఈ వేడుక కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి కాంతారావు, డీపీఓ జయసుధ, డీపీఆర్ఓ చెన్నమ్మ, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి


