తాండూరు రూరల్: కరన్‌కోట్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జినుగుర్తి గ్రామంలోని దళిత రైతు నర్సిములుకు చెందిన భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో అబ్దుల్ వాహబ్, ఆనంద్‌కుమార్, ఉప్పలి మల్కయ్య, శ్రీనివాస్, బుగ్గప్ప, చంద్రయ్య, గుమ్మడి రత్నం, సత్యనారాయణ, స్వామిదాస్, మహేందర్, రఘుపతి, నర్సిములు, ప్రకాశ్, జినుగుర్తి నర్సింలు పాల్గొన్నారు.
సీఐ ఆగ్రహం
పీఎస్ ఎదుట ధర్నా చేసిన ప్రజాసంఘాల తీరుపై రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రెవెన్యూకు సంబంధించిన అంశాల్లో పోలీసులు ఏం చేస్తారని మండిపడ్డారు. భూమి అమ్మిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించిన పంచాయితీని తీసుకొచ్చి పోలీసు అధికారులపై ఆరోపణలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తంచేశారు. పీఎస్ ఎదుట ధర్నా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్ఐని ఆదేశించారు.
ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ


