పహాడీషరీఫ్: మదర్సా నుంచి బాలుడు అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సొహేల్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సయీం కుమారుడు మహ్మద్ సలామత్ (14) ఎర్రకుంట తూర్ కాలనీలోని మదర్సాలో విధ్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల 23న ఉదయం 7 గంటలకు మదర్సాలో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఉపాధ్యాయుడు రహబర్ ఇస్లాం శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62366 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.


