లారీల అడ్డాగా.. ఆర్టీసీ బస్టాండ్‌ | - | Sakshi
Sakshi News home page

లారీల అడ్డాగా.. ఆర్టీసీ బస్టాండ్‌

Sep 27 2026 2:09 PM | Updated on Sep 27 2026 2:09 PM

లారీల అడ్డాగా.. ఆర్టీసీ బస్టాండ్‌ మహిళా ఎస్‌ఐతో అసభ్య ప్రవర్తన: కేసు నమోదు

బషీరాబాద్‌: లక్షలాది రూపాయల ప్రజాధనంతో బషీరాబాద్‌లో నిర్మించిన బస్టాండ్‌ నిరుపయోగంగా మారింది. ఇక్కడికి బస్సులు రాకపోవడంతో లారీల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. అధికారులు స్పందించి ఇప్పటికై నా బస్టాండ్‌ను అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

శంకర్‌పల్లి: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ క్వార్టర్స్‌ దగ్గర ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) మృతదేహం పడి ఉంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీర్‌పేట: మహిళా ఎస్‌ఐతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మీర్‌పే పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. అల్మాస్‌గూడ కమాన్‌ వద్ద ఆక్సిజన్‌ ఫిట్‌నెస్‌ క్లబ్‌ వారు ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన ఊరేగింపు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగుతోంది. సమాచారం అందుకున్న మహిళా ఎస్‌ఐ సిబ్బందితో అక్కడికి చేరుకుని మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశం ఉండడంతో నృత్యాలు ఆపి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ క్లబ్‌ యజమాని సాకేత్‌ కుమార్‌ ఎస్‌ఐతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమె విధులకు ఆటంకం కలిగించాడు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు సాకేత్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

భూ వివాదంలో

ఇద్దరిపై దాడి

షాబాద్‌: భూ వివాదం నేపథ్యంలో ఇద్దరిపై కర్రలు, రాయితో దాడి చేసిన ఘటన షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని నాగర్‌కుంట రోడ్డు సమీపంలో భూ వివాదం కారణంగా గొడవ జరిగింది. ఈ ఘటనలో తొంట వెంకటేశ్‌, తొంట చిన్న రాములుపై దాడి చేసి గాయపర్చాడు. దాడిలో వెంకటేశ్‌ ఎడమ చేతికి, చిన్న రాములు ఎడమ కంటి సమీపంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తొంట నర్సింలు, తొంట పెద్ద రాములు, తొంట అభిషేక్‌, తొంట అఖిల్‌పై కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.పది లక్షల

విలువైన వైరు చోరీ

యాచారం: ఓ వెంచర్‌లో రూ.పది లక్షలకు పైగా విలువ జేసే విద్యుత్‌ వైరు చోరీకి గురైంది. వివరాలివీ.. తక్కళ్లపల్లి తండా పరిధిలో ఓ రియల్‌ వ్యాపారి పది ఎకరాల్లో టీడీసీపీ వెంచర్‌ చేశాడు. ఇందులో 80 విద్యుత్‌ స్తంభాలకు చెందిన వైరును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు సదరు వ్యాపారి శనివారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement