సర్పంచ్‌ భర్తపై చర్యలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ భర్తపై చర్యలకు డిమాండ్‌

Sep 27 2026 2:09 PM | Updated on Sep 27 2026 2:09 PM

యాలాల: మండలంలోని ఎన్కెపల్లి సర్పంచ్‌ భర్త అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అధికారుల సంతకాలను ఫోర్జరి చేశాడని ఉప సర్పంచ్‌ బీటీ రామప్ప, ఏఎంసీ డైరెక్టర్‌ శంకర్‌, గ్రామస్తులు ఆరోపించారు. శనివారం ఎంపీడీఓ శ్రీనిజకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ స్వరూప భర్త వెంకటేశ్‌.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఫిబ్రవరిలో శిథిలావస్థ పాఠశాలను కూల్చేందుకు పాలకవర్గ తీర్మానాన్ని తయారు చేశారన్నారు. భవన శిథిలాల తొలగింపునకు జేసీబీ ఖర్చు రూ.38 వేలు అయితే.. ఎంబీ రికార్డు మాత్రం రూ.60వేలకు పైగా అయిందని, నిధులు విత్‌డ్రా చేసేందుకు నోట్‌ఫైల్‌ తయారు చేశారని తెలిపారు. వీటితో పాటు జీపీకి సంబంధించిన రికార్డులను తన ఇంట్లో పెట్టుకుంటున్నాడని ఆరోపించారు. ప్రతి కార్యక్రమంలో సర్పంచ్‌కు బదులు ఆయనే హాజరవుతున్నారని తెలిపారు. ఆధారాలను ఎంపీడీఓకు అందజేదశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తలారి శ్రీనివాస్‌, ఎల్లప్ప తదితరులు ఉన్నారు.

ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన నాయకులు, గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement