బయటకు వెళ్లి వస్తానని చెప్పి.. | - | Sakshi
Sakshi News home page

బయటకు వెళ్లి వస్తానని చెప్పి..

Sep 27 2026 2:09 PM | Updated on Sep 27 2026 2:09 PM

యువకుడి అదృశ్యం

చేవెళ్ల: బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన ఎర్రవల్లి రవికుమార్‌ (28) వెల్‌స్పన్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో భార్యకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో భార్య వెతకడం ప్రారంభించింది. ఫోన్‌ ఇంట్లోనే వదిలిపోవటంతో అతని కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement