కొంత మంది రాత్రి సమయాల్లో రోడ్ల పక్కన చెత్త పారబోస్తున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నాం. ఈగలు, దోమలు చేరి రోగాలు వ్యాపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది రోడ్ల పక్కన చెత్తవేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టాలి.
– శ్రీనివాస్‌చారి, సురంగల్, మొయినాబాద్
రోడ్ల పక్కన వేసిన చెత్తను ఉదయాన్నే సిబ్బందితో తొలగించి శుభ్రం చేయిస్తున్నాం. చెత్త వేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. డంపింగ్ యార్డుకోసం చిలుకూరు రెవెన్యూలో స్థలాన్ని పరిశీలించాం. హిమాయత్‌నగర్ రెవెన్యూలో డంపింగ్‌ను త్వరలో అక్కడి నుంచి తరలిస్తాం.
– టి.కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్


