తాండూరు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని సల్లా గార్డెన్‌లో ఎల్మకన్నె పీఏసీఎస్ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పక్షాన ఉండే నాయకుడు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. అన్నదాతల అవసరాలకు తగ్గట్లుగా రుణాలు ఇవ్వాలని సూచించారు. తాను పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సహకార సంఘాల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. గత పాలకులు తాండూరు అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలో జుంటిపల్లి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. చివరి ఆయకట్టు భూములకు నీరందాలన్నదే తమ లక్ష్యమన్నారు. అనంతరం పీఏసీఎస్ అధికారులు చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం మాజీ సభ్యుడు రమేష్ మహరాజ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్మన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బషీరాబాద్ సర్పంచ్ వెంకటేశ్ మహరాజ్, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, సర్ కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.
పంట రుణాలు ఇచ్చి అండగా నిలవాలి
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
కొలువుదీరిన ఎల్మకన్నె పీఏసీఎస్ నూతన పాలకవర్గం


