కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

బంట్వారం: అధికారులు, ప్రజాప్రనిధులు కలిసి పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీ సీఈఓ సుధీర్‌ అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ రాములు అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఎజెండాలోని అంశాలను, ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మహిళా సమాఖ్యకు సంబంధించి గ్రామ పంచాయతీలకు ఎలాంటి సమాచారం అందడం లేదని బంట్వారం, యాచారం సర్పంచ్‌లు మల్లేశం, జ్యోతిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. స్పందించిన జెడ్పీ సీఈఓ సర్పంచ్‌లకు తప్పని సరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. మండల కేంద్రానికి మంజూరైన పసుపు యూనిట్‌ పనులు ఏ దశలో ఉన్నాయని సర్పంచ్‌ మల్లేశం ప్రశించారు. డీఆర్‌డీఓ నుంచి అనుమతులు రాగానే ప్రారంభిస్తామని ఏపీఎం వివరణ ఇచ్చారు. మార్కెట్‌ యార్డు నిర్మాణానికి గ్రామ కంఠంలో ఎకరం భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బంట్వారం సర్పంచ్‌ తెలిపారు. అందుకు ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. మద్వాపూర్‌ నుంచి బుగ్గాపూర్‌ వరకు పీఆర్‌ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ గోరేమియ అధికారులను కోరారు. విద్యుత్‌ సమస్యపై తొర్మామిడి, సల్బత్తాపూర్‌ సర్పంచ్‌లు సంజీవయ్య, బాలయ్య ట్రాన్స్‌కో ఏఈని నిలదీశారు. వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రమణ, ఎంపీడీఓ రాములు, ఎంపీఓ నాగరాజు, డీటీ మహేశ్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ కమల, మెడికల్‌ ఆఫీసర్‌ మజీద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ సుధీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement