బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు
కుల్కచర్ల: చెంచు ప్రజల అభ్యున్నతికి మల్టీ పర్పస్ భవనాల నిర్మాణం చేపడతున్నట్లు బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. మంగళవారం ఆయన రాంపూర్ పంచాయతీ పరిధిలో నిర్మానంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇస్తున్న నిధులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అబివృద్ధి పనులు కొనసాగుతున్న విషయాన్ని గ్రామస్తులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తిరుపతయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్: అతివేగం కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మండల పరిధిలోని చంద్రవంచ దర్గా సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఓగిపూర్ శివారు నా పరాతి బండల కోసం గనుల్లోకి వెళ్తున్న ట్రాక్టర్ చంద్రవంచ దర్గా సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపి నాపరాతి గనులకు తరలించారు.
పూడూరు: ఆర్టీసీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నవాబుపేట మండలం అక్నాపూర్‌కు చెందిన అశోక్ (33) సోమవారం బైక్‌పై చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో తాండూరు డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో కండ్లపల్లి గేట్ సమీపంలో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అశోక్‌ను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. భార్య శశికల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అతివేగం కారణంగా..
మర్పల్లి: బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్ప పొందతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటన మర్పల్లి ఠాణా పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవూఫ్ తెలిపిన ప్రకారం.. బంట్వారం మండలం మాల సోమారం గ్రామానికి చెందిన అమ్రాది నర్సింలు(45) తన బైక్ ఈ నెల 3న మర్పల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అతివేగంగా వెళ్తున్న ఆయన పెద్దపూర్ గేట్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుటుంసభ్యులకు చెప్పి చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తమ్ముడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం బోధునంపల్లికి చెందిన రిటైర్డు పట్వారీ బండ వెంకట్‌రెడ్డి మంగళవారం కేశంపేట చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పరమేశ్ తెలిపారు.


