పక్కాగా సాగు లెక్క | - | Sakshi
Sakshi News home page

పక్కాగా సాగు లెక్క

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

రైతుకు ప్రయోజనం

దౌల్తాబాద్‌: పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మండల పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌ నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఈ మేరకు వలంటీర్లు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పంటల వివరాలు అందులో నమోదు చేస్తున్నారు.

25 మంది నియమాకం

మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 25 మంది వలంటీర్లు నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు చేస్తున్నారు. వలంటీర్లు సదరు గ్రామానికి చెందిన వారే కావడంతో సర్వే చురుగ్గా సాగుతోంది.

కచ్చితమైన డేటా

రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో మండలంలో ఏ పంట ఎంతమేర సాగవుతుందో కచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగా రైతులకు ఎరువులు ఇతర సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం అందుతాయి. సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ రైతుబంధు, ఇతర పథకాలు వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే సర్వేతో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులుకు సరైన గిట్టుబాటు లభించే అవకాశం ఉంటుంది.

పంట సర్వే చేస్తున్న వలంటీర్‌

వానాకాలం సీజన్‌లో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసేందుకు డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేపట్టాం. ప్రస్తుతం వలంటీర్లు గ్రామాల్లో క్రాప్‌ బుకింగ్‌ సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేస్తాం.

– తులసి, ఏఓ, దౌల్తాబాద్‌

డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రారంభం

ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌ నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement