అనంతగిరి: ఆశ వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపచేయాలన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నేటికి అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మంజుల, అనిత, జమున, విజయలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య


