సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత

అనంతగిరి: ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి స్వర్ణలత ఆదేశించారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని పురపాలిక కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్‌, మండలంలోని బీఎల్‌ఓలు, సూపర్‌ వైజర్లలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలోని 57.25శాతం, మండల పరిధిలో 81.90 శాతం పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డీఆర్‌ఓ ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement