స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఆహ్వానం
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో వెలసిన అనంతపద్మనాభ స్వామి ఆలయ ఆషాఢ మాసం చిన్న జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈఓ నరేందర్ బుధవారం తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వా న పత్రికను స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. ఈ నెల 29వ తేదీ వరకు జాతర జరగనుంది.
ప్రజారోగ్యం ఎంతో ముఖ్యం
డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్
పూడూరు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్ అన్నారు. బుధవారం మండలంలోని మన్నెగూడ ఆరోగ్య మందిరంలో సేవల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మృల్యాంకన బృందం రాజస్థాన్, మధ్యప్రదేష్ నుంచి వర్చువల్‌గా పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు మహమూద్ ఫారూఖీ, అజయ్, సీహెచ్‌ఓ పద్మ, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
యాచారం: కూలీ పనికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన వి.శివాజీ ఈ నెల 15న ఇంట్లో నుంచి కడ్తాల్‌కు సెంట్రింగ్ పనికి వెళ్తున్నానని, వాళ్ల అమ్మ సువర్ణకు చెప్పి వెళ్లాడు. నాలుగు రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడం, వివిధ గ్రామాల్లో బంధువులు, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీసిన జాడలేదు. దీంతో బుధవారం గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను ఆగస్టు మూడో వారానికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. వర్షం నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ రెండు చెరువుల పునరుద్ధరణ పనులను ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు చుట్టూ పాత్‌వే నిర్మాణంతో పాటు ప్రధాన గేట్ల ఏర్పాటును చూశారు. వరద కట్టడి, భూగర్భ జలాల వృద్ధితో పాటు.. ఓ చెరువు వల్ల సమకూరే ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలిసి వచ్చేలా చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. కబ్జా కోరల్లో చిక్కి 16.4 ఎకరాలకు పరిమితమైన సున్నంచెరువును ఆక్రమణలను తొలగించి 30.5 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. అలాగే తమ్మిడికుంట కూడా 16.2 ఎకరాలకు పరిమితం కాగా...29.3 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేస్తోంది. ఈ చెరువుల చుట్టూ బలమైన బండ్ ఏర్పాటుతో పాటు చుట్టూ విశాలమైన పాత్‌వే నిర్మాణం చేపట్టాలని హైడ్రా కమిషనర్ సూచించారు. చెరువుల చెంత పార్కులు, ఓపెన్ జిమ్‌లు, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా ఎస్‌టీపీల నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాల ని సూచించారు. చెరువు పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. హైడ్రా అసెట్ ప్రొటెక్షన్ విభాగం అడిషనల్ కమిషనర్ డి.ఆనంద్‌కుమార్, ఏసీపీ తిరుమల్, చెరు వు పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రా ట్స్ యజమాని యూనస్‌తో పాటు పలువురు అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఉన్నారు.


