కొడంగల్: మున్సిపల్ పరిధిలోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. చినుకు పడితే చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి వర్షానికే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లోని సీసీ రోడ్లను తవ్వారు. పైప్‌లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తవ్వకాలు చేపట్టారు. పనులు త్వరితగతిన చేయకపోవడంతో స్థానికులకు ఇబ్బందిగా మారింది. శాంతినగర్, లాహోటీకాలనీ, కార్గిల్ కాలనీ, గాంధీనగర్, తెలంగ్‌వాడీ, వడ్డర్‌గల్లీ తదితర ప్రాంతాల్లో దారులు రాకపోలకు అనుకూలంగా లేవు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


